NTV Telugu Site icon

Actor Shivaji: ఏ పార్టీ నాకు చుట్టం కాదు.. తప్పు చేస్తే ఎవ్వరినైనా..

Shivaji

Shivaji

Actor Shivaji: సినీనటుడు శివాజీ ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు డబ్బులు అడగొద్దని.. తప్పు చేసి చాలా మంది సంపాదిస్తున్నారని ఆయన ప్రజలకు సూచించారు. తెలుగు వాడికి కష్టం వస్తే తాను సహించనని.. అన్యాయం చేస్తే ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తానని అన్నారు.

Read Also: Upasana Konidela: గవర్నర్ ను కలిసిన మెగా కోడలు..

మన రాష్ట్రం బాగుపడలేదని అడిగే హక్కు మనకు లేదని.. డబ్బు తీసుకొని ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు. డబ్బు తీసుకోకుండా ఓటెయ్యాలని.. అలా వేస్తే ఏ సమస్యపైనా అయినా తాను చొక్కా పట్టుకొని అడుగుతానన్నారు. ప్రపంచం మారింది కానీ.. తెలుగు వాళ్ళు మారలేదన్నారు. చంద్రబాబు, జగన్ ఎవ్వరికీ ఏమీ చెయ్యలేదన్నారు. మారితే మారండి మారకపోతే మీ ఇష్టమంటూ ప్రజలనుద్దేశించి శివాజీ వ్యాఖ్యానించారు. తాను మాట్లాడుతూనే ఉంటానన్నారు. సినిమాలు చేసుకుంటానని ఆయన తెలిపారు. తనను తిట్టినా ఇబ్బంది లేదని.. ఏ పార్టీ తనకు చుట్టం కాదని.. తప్పు చేస్తే ఎవ్వరినైనా వంగో బెడతానని నటుడు శివాజీ అన్నారు.