Site icon NTV Telugu

Shivaji: అనసూయకు శివాజీ స్ట్రాంగ్ కౌంటర్: “నీ రుణం తీర్చుకుంటా..!” అసలు వివాదంలోకి ఆమె ఎందుకు వచ్చిందంటూ సంచలనం!

Sivaji

Sivaji

Shivaji: దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్లకు చేసిన సూచనలు కలకలం రేపాయి. వారు సామాన్లు కనపడేలా బట్టలు వేసుకోవద్దంటూ ఆయన సూచనలు చేయడంతో, ఈ అంశం మీద సింగర్ చిన్మయి మొదలు అనసూయ వంటి వారు స్పందిస్తూ రావడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈ అంశం మీద తెలంగాణ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయింది. శివాజీకి నోటీసులు సైతం జారీ చేసింది.

649cc లిక్విడ్ కూల్డ్ పారలల్ ట్విన్ ఇంజన్, కొత్త ఫీచర్లు, టెక్నాలజీతో 2026 Kawasaki Ninja 650 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!

తాజాగా ఈ అంశం మీద మరోసారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన శివాజీ స్పందించారు. తాను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లపై అసభ్యంగా తాకుతూ జరిగిన కొన్ని సంఘటనలు తన దృష్టికి వచ్చాయని, వాటిని ఉద్దేశించి చీర కట్టుకుని వస్తే ఇలాంటివి తగ్గుతాయనే ఉద్దేశంతో తాను మాట్లాడానని అన్నారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదని, తాను ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. వాస్తవానికి ఆమె పేరునే కాదు, తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని, హీరోయిన్లు అంటూ మాత్రమే మాట్లాడానని అన్నారు.

90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో బడ్జెట్ సెగ్మెంట్‌లో HMD Pulse 2 లాంచ్‌కు సిద్ధం..!

అంతేకాక, తన మీద జాలి చూపించిన అనసూయకు అటువంటి విశాల హృదయం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే, అనసూయ రుణం తీర్చుకునే అవకాశం త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version