Site icon NTV Telugu

MLC Kavitha: కల్వకుంట్ల కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ

Mlc Kavitha

Mlc Kavitha

Actor Sharath kumar Meet MLC Kavitha: ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్ శనివారం నాడు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు లక్ష్యాలు , ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. వీరి సమావేశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కవితతో సమావేశమై చర్చించిన శరత్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు సీనియర్ నేతలు, పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నారు. పార్టీ పటిష్టత, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారని సమాచారం. ఈ సమయంలో కవితతో శరత్‌కుమార్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Tamil Nadu Minister: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్

తమిళనాడు మాత్రమే కాదు. ఒడిశాలోనూ బీఆర్ఎస్ వైపే నేతలు మొగ్గు చూపారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గమాంగ్ కుటుంబంతో కలిసి BRS పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో గిరిధర్‌ను సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గిరిధర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. BRSలో చేరిన వారిలో హేమా గమాంగ్, జయరామ్ పాంగి, రామచంద్ర హంష్దా, బృందావన్ మ‌జ్హీ, నబీన్ నందా, రాథా దాస్, భాగీరథి సేథి మరియు మాయాదర్ జెనా ఉన్నారు. బీఆర్‌ఎస్ ఒడిశా శాఖ అధ్యక్షుడిగా గిరిధర్ గమాంగ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..

Exit mobile version