NTV Telugu Site icon

Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?

Shalini Ajith

Shalini Ajith

Shalini – Ajith : తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ భార్య, నటి షాలిని చెన్నైలో ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంగా ఆమెకు మంగళవారం న్నాడు చెన్నై నగరంలోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చిన్న సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే షాలినికి సర్జరీ అయిన విషయం తెలుసుకున్న ఆమె భర్త హీరో అజిత్.. అజర్బైజాన్ నుంచి వెంటనే చెన్నైకి చేరుకున్నాడు. ఈ సమయంలో ఆస్పత్రిలో అజిత్ తో దిగిన ఫొటోను షాలిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అది కాస్త వైరల్ గా మారింది.

WhatsApp Stop In Mobiles : ఇకపై ఆ 35 స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్ లో మీ ఫోన్ ఉందోలేదో చూసుకోండి..

షాలిని గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో ఆమెకు చిన్నపాటి సర్జరీ అవసరం పడింది. షాలిని ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి అజిత్ అభిమానులు ఆందోళన చెందారు. ఆమె త్వరగా కోలుకోవాలని వారు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అజర్‌బైజాన్‌ లో తన తర్వాతి చిత్రం ‘విదా ముయార్చి’ షూటింగ్‌లో ఉన్న నటుడు అజిత్ కుమార్ ఆమెను చూసుకోవడానికి చెన్నైకి తిరిగి వచ్చాడు. ఈ చిత్రం షూటింగ్ కోసం నటుడు మళ్లీ అజర్‌ బైజాన్‌ కు వెళ్తారని సమాచారం.

Coin Stuck In Man’s Windpipe: వ్యక్తి శ్వాసనాళంలో 8 ఏళ్లుగా 25 పైసల నాణేం.. అరుదైన శస్త్రచికిత్స..

షాలిని షేర్ చేసిన ఫోటోలో, ఆమె హాస్పిటల్ బెడ్ పై అజిత్ కుమార్ చేయి పట్టుకుని ఉండగా ఫోటోకి పోజులిచ్చింది. గుండె ఎమోజీల ఆమె ఫోటోకు ” లవ్ ఫర్ ఎవర్ ” అని క్యాప్షన్ ఇచ్చింది. 1999లో “అలైపాయుతే” సినిమా ద్వారా షాలిని నటిగా అరంగేట్రం చేసింది. ఆమె అజిత్‌ను 2000లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Show comments