NTV Telugu Site icon

Sayaji Shinde: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఎవరు ఆందోళన పడకండి..

Shiyaji Shinde

Shiyaji Shinde

అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కీలక అప్‌డేట్‌ ఇస్తూ.. ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా.. అభిమానులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు తొందరలోనే తిరిగి వస్తాను అని చెప్పారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా, సాయాజీ షిండే ఈ నెల 11వ తేదీన ఛాతీలో నొప్పి రావడంతో ఇబ్బంది పడ్డారు. కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలోని ఓ ప్రైవేటు హస్పటల్ కు తరలించారు. పలు టెస్టులు చేసిన తర్వాత గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. యాంజియోగ్రఫీ తర్వాత గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ గుర్తించాము.. తీవ్రత దృష్ట్యా వెంటనే యాంజియోప్లాస్టీ చేశామని వైద్యులు పేర్కొన్నారు.

Read Also: MP Laxman: అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఇక, మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి తెలుసు.. జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఠాగూర్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కిన చాలా మూవీస్ ల్లో ప్రతి నాయకుడు ( విలన్ ), సహాయ నటుడి పాత్రలను ఆయన పోషించారు. గుడుంబా శంకర్‌, ఆంధ్రుడు, సూపర్‌, అతడు, రాఖీ, పోకిరి, దుబాయ్‌ శీను, నేనింతే, కింగ్‌, అదుర్స్‌ లాంటి సినిమాలు సాయాజీ షిండేకు మంచి పేరు తీసుకొచ్చాయి.