Satyadev Next Movie: యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చివరిసారిగా ‘గుర్తుందా సీతాకాలం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి తన అభిమానులను అలరించేందుకు మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న సత్యదేవ్ 26వ చిత్రం గురించి చిత్రబృందం కొన్ని విషయాలను ప్రకటించింది. ఇంతకి ఆయన నటిస్తున్న చిత్రం పేరేమిటంటే..
సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న 26వ సినిమాకు అధికారికంగా ‘జీబ్రా’ అనే పేరు పెట్టినట్లు మేకర్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఆసక్తికర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది.
SS Rajamouli: కీరవాణికి పద్మశ్రీ.. జక్కన్న ఏమన్నారంటే?
పుష్ప నటుడు డాలీ ధనంజయ కూడా ఈ చిత్రంలో భాగంగా ఉన్నారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్‌ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ పాన్-ఇండియన్ మూవీలో సత్యరాజ్, జెన్నిఫర్ పిచినాటో, సత్య ఆకల, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు.