NTV Telugu Site icon

Sarath Babu : నేడు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు

Sharath Babu

Sharath Babu

Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కన్నుమూశారు. శరత్‌ బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ చాంబర్‌కు తరలించారు. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించారు. శరత్‌ బాబు అంత్యక్రియలు మంగళవారం (మే 23న) చెన్నైలో జరగనున్నాయి.

Read Also:Sangeetha : వామ్మో హీరోయిన సంగీత తల్లి అలాంటిదా.. అంతగా టార్చర్ చేసిందా ?

శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతనికి తొమ్మిది మంది అన్నదమ్ములు. శరత్ బాబుకి అగ్ర నటులు అయిన శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, శరత్ కుమార్ ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది. శరత్ బాబు 1973వ సంవత్సరంలో ‘రామ రాజ్యం’ అనే సినిమాతో పరిశ్రమలోకి ఆరంగేట్రం చేశారు. ఆయన సినిమా రంగ ప్రవేశం చేసిన కొన్నాళ్ల తరువాత తనకన్నా కొన్ని సంవత్సరాలు పెద్దది అయిన నటి రమాప్రభతో కొన్నేళ్లు కాపురం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రమాప్రభని పెళ్లిచేసుకోలేదు అని వివరించారు. ఆ తర్వాత తమిళ నాడులో ప్రముఖ నటుడైన నంబియార్ కూతురు స్నేహలతని 1990లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ 20 ఏళ్ళు కాపురం చేశాక, 2011 సంవత్సరంలో విడిపోయారు. 200కి పైగా సినిమాలలో నటించారు శరత్ బాబు.

Read Also:Uttar Pradesh: తాగుబోతు వరుడికి షాక్ ఇచ్చిన పెళ్లికూతురు..