Site icon NTV Telugu

Sanjay Dutt: షూటింగ్​లో బాంబు పేలుడు.. గాయాలపాలైన సంజయ్ దత్

Sanjay Dutt

Sanjay Dutt

Sanjay Dutt: బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ షూటింగ్ సెట్స్ లో గాయాల పాలయ్యాడు. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి చిత్రంలో సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా పోరాట సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ పేలుడు ప్లాన్ చేశారు. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఈ పేలుడు కారణంగా సంజయ్ దత్ చేతులు, ముఖం, భుజం మీద గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన సంజయ్ దత్ ని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందజేస్తున్నారు వైద్యులు. సంజయ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పినల్లు సమాచారం. అంతకు ముందే సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. క్యాన్సర్ సమయంలో సుదీర్ఘ కాలం పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నారు.

Read Also: India Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన ఐఎంఎఫ్.. అయినా ప్రపంచం ఆశంతా భారత్‌పైనే..

‘కేడీ’ సినిమాకు ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్ ఎవరో కాదు రవితేజ నటించిన ‘ఇడియట్’ సినిమాలో నటించిన హీరోయిన్ రక్షిత భర్త. సినిమా అనౌన్స్ చేసినప్పుడు టీజర్ కూడా విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్​గా టీజర్​ను రూపొందించారు. కన్నడ చిత్రం కేజీఎఫ్​తో బాలీవుడ్​ స్టార్ సంజయ్​ దత్​.. దక్షిణాదిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. కేజీఎఫ్​లో అధీరా పాత్రలో సంజయ్​నటనకు చాలా మంది ముగ్ధులయ్యారు. ఆ సినిమా తర్వాత కన్నడ నుంచి సంజయ్ దత్ కు చాలా ఆఫర్లు వచ్చాయి.

Exit mobile version