NTV Telugu Site icon

Thalapathy Vijay: రాసిపెట్టుకోండి.. విజయ్ తమిళనాడు సీఎం అవుతారు! ప్రేమ్‌గీ జోస్యం

Thalapathy Vijay

Thalapathy Vijay

Premgi Amaren About Thalapathy Vijay: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన ‘ది గోట్‌’ (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) నేడు రిలీజ్ అయింది. ది గోట్ రిలీజ్ సందర్భంగా కోలీవుడ్ నటుడు ప్రేమ్‌గీ అమరేన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తమిళనాడు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తన ఓటు విజయ్‌కే అని, వెయిట్ అండ్ సీ అని పేర్కొన్నారు. ప్రేమ్‌గీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ది గోట్‌లో ప్రేమ్‌గీ నటించారు.

ది గోట్‌ రిలీజ్ నేపథ్యంలో విజయ్ రాజకీయ ప్రవేశం గురించి ప్రేమ్‌గీ అమరేన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అవును.. నేను 2026లో విజయ్‌కు ఓటేస్తాను. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని నేను మీకు హామీ ఇస్తున్నాను. వెయిట్ అండ్ సీ’ అని ప్రేమ్‌గీ అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో దళపతి విజయ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవల పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దళపతి సిద్ధమవుతున్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Also Read: Simi Singh: ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ ఆల్‌రౌండర్‌.. దాతల కోసం ఎదురుచూపు! కోమాలోకి వెళ్లే ప్రమాదం

ది గోట్‌లో తన పాత్ర గురించి కూడా ప్రేమ్‌గీ అమరేన్‌ చెప్పారు. ‘సినిమాలో విజయ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. నేను పెద్ద విజయ్‌ని మామ అని పిలుస్తాను. చిన్న విజయ్ నన్ను అంకుల్ అని పిలుస్తాడు. సినిమాలో స్నేహకు సోదరుడి పాత్రలో నటిస్తున్నాను. పెద్ద విజయ్‌కు ఆమె భార్య’ అని ప్రేమ్‌గీ తెలిపారు. ‘నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్‌స్టార్ రజనీకాంత్. అయితే నాకు అజిత్‌, విజయ్‌ అంటే చాలా ఇష్టం. అయితే సూపర్‌స్టార్‌ అందరికంటే ఎక్కువ’ అని చెప్పుకొచ్చారు.

Show comments