NTV Telugu Site icon

Prakash Raj: చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ కార్టూన్ ట్వీట్.. మండిపడుతున్న జనాలు

Prakash

Prakash

చంద్రయాన్ -3 పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కార్టూన్ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చంద్రుడి నుంచి వస్తున్న తొలి చిత్రం’ అంటూ ఓ పోస్టు చేశారు ప్రకాష్ రాజ్. ఆ కార్టూన్ లో లుంగీ కట్టుకొని, పొడవాటి చేతులు ఉన్న షర్ట్ ధరించి, టీ పోస్తున్నట్లు ఉన్న ఫొటోను ఆదివారం షేర్ చేశారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుంచి పంపిన తొలి ఫొటో ఇదే అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఉన్న ద్వేషాన్ని ఆయన దేశ శాస్త్రవేత్తలపై చూపిస్తున్నారని, చరిత్రాత్మక మిషన్‌ను అపహాస్యం చేశారంటూ జనాలు విమర్శిస్తున్నారు.

Nandamuri Brothers: అన్నలతో తమ్ముడు.. మిలియన్ డాలర్ పిక్ అంటార్రా బాబు

అంతేకాకుండా.. చంద్రయాన్-3ని ప్రకాశ్ రాజ్ అపహాస్యం చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ పోస్ట్ పై కమెడియన్ అపూర్వ్ గుప్తా కూడా స్పందించారు. ‘‘ఒకరిని ద్వేషించడానికి, దేశాన్ని ద్వేషించడానికి తేడా ఉందంటూ పేర్కొన్నారు. చాలా మంది యూజర్లు ఇలాంటి భావాలనే వ్యక్తపరిచారు. అతడి రాజకీయ భావజాలంతో సంబంధం లేకుండా మూన్ మిషన్ ను గౌరవించాలని సలహా ఇచ్చారు. మరోవైపు కొందరు వినియోగదారులు మోడీని విమర్శించే ప్రయత్నంలో శాస్త్రవేత్తల కృషిని అపహాస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ విఫలం కావాలని, దీని వల్ల మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కొందరు దేశ పౌరులు ప్రార్థిస్తున్నారని మరో ఎక్స్ (ట్విట్టర్) యూజర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. చాలా కాలంగా ప్రధాని మోడీని, బీజేపీపై ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన బహిరంగంగా వ్యతిరేకించారు.

Mr Pregnant: పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’..

చంద్రయాన్-3 ఆగష్టు 23 బుధవారం సాయంత్రం 6.04 నిమిషాలకు చంద్రునిపై ల్యాండ్ కానుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో కృషి చేస్తోంది. సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన ప్రపంచంలో నాల్గవ దేశంగా భారత్‌ అవతరిస్తుంది. చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్‌కు విక్రమ్ సారాభాయ్ (1919–1971) పేరు పెట్టారు. విక్రమ్‌ సారాభాయ్‌ భారత అంతరిక్ష పితామహుడిగా పేరు పొందారు. నాలుగేళ్ల క్రితం 2019 సెప్టెంబర్ లో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి, చివరి దశలో విఫలమైన చంద్రయాన్-2కు కొనసాగింపుగా ఈ మిషన్ ను ఇస్రో చేపట్టింది.