Site icon NTV Telugu

Prabhas: ‘ఆదిపురుష్’ హిట్ కావాలని భద్రాద్రి ఆలయానికి రూ.10లక్షల విరాళం

Prabhas

Prabhas

Prabhas: వరుస ప్లాపులు వచ్చిన ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విడుదలకు ముందే ఆదిపురుష్ మూడి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో.. ఈ ట్రైలర్ నెట్టింట సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్‌ మార్క్‌ని టచ్ చేసింది ఈ ట్రైలర్. దీంతో వరల్డ్ వైడ్‌గా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో ఆయన రికార్డ్స్‌ వేట మొదలుపెట్టి ఇప్పుడు ఆదిపురుష్ వరకు కొనసాగిస్తూనే ఉన్నారు.

Read Also:PBKS vs DC: పంజాబ్ కింగ్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయం

ప్రపంచవ్యాప్తంగా వరుసగా నాలుగు సినిమాల ట్రైలర్స్ 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. బాహుబలి2, రాధే శ్యామ్, సాహూ, ఇప్పుడు ఆదిపురుష్.. ఈ నాలుగు సినిమాల ట్రైలర్స్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డు సెట్ చేశాయి. ప్రభాస్ నుండి వస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు కూడా ఇదే రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని అభిమానులకు అంటున్నారు.

Read Also:BJP out From South India: సౌత్‌ నుంచి బీజేపీ ఔట్..! మరీ దారుణం..

ఇది ఇలా ఉంటే.. ప్రభాస్ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రూ. 10 లక్షల విరాళం అందించారు. ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి నిన్న ఆలయానికి వచ్చి ఈవో రమాదేవికి చెక్కు అందజేశారు. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ చిత్రం విజయవంతం కావాలని ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ప్రభాస్ విరాళంగా అందించిన రూ. 10 లక్షల మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయించినట్టు ఏఈవో భవానీ రామకృష్ణారావు తెలిపారు.

Exit mobile version