Site icon NTV Telugu

Actor Manoj : శామీర్ పేట కాల్పుల కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

Shamirpet

Shamirpet

శామీర్ పేట కాల్పుల కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2003లో స్మిత గ్రంధి తో సిద్ధార్థ్ దాస్ కు వివాహం జరిగింది. అయితే.. వీరికి ఇద్దరు పిల్లలు (17 ఏళ్ల కుమారుడు, 13 కుమార్తె) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేట లో ఉండేవారు. అయితే.. 2018 లో‌ సిద్ధార్థ్ పై గృహహింస కింద ఫిర్యాదు చేసిన భార్య స్మిత.. అనంతరం విడాకులకు అప్లై చేసింది. అప్పటి నుండి‌ విడిగా ఉంటున్నారు భార్యభర్తలు. ఈ క్రమంలోనే.. తమను మనోజ్‌ అలియాస్ సూర్యతేజ హింసిస్తున్నట్లుగా CWC కి స్మిత కొడుకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన తండ్రి సిద్ధార్థ్.. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30 గంటలకు సెలబ్రటి విల్లా వెళ్లాడు.

Also Read : Viral Video: ప్రవహిస్తున్న వరదలో కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్..!

దీంతో.. సిద్ధార్థ్ ను చూడగానే మనోజ్ ని పిలిచిన భార్య స్మిత.. లోపలి నుండే ఏయిర్ గన్ తో సిద్ధార్థ్ ను దూషిస్తూ వచ్చిన మనోజ్.. సిద్ధార్థ్ దాస్ ను భయభ్రాంతులకు గురి చేయడానికి ఏయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. తప్పించుకుని పోలీసులకు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశాడు సిద్ధార్థ్ దాస్.. స్మిత తో కలిసి తన బంధాన్ని ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్ ను మనోజ్ చంపేయాలనుకున్నట్లు.. ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఏయిర్ గన్ లో పెల్లెట్స్ నింపి సిద్ధార్థ్ పై మనోజ్‌ షూట్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Also Read : World Cup: ప్రపంచ కప్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!

పలు సినిమాలు సీరియల్స్ లో నటించిన మనోజ్.. అవకాశాలు రాకపోవడం తో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై స్మిత డిప్రెషన్ కౌన్సెలింగ్ కు వెళ్లిన మనోజ్.. అనంతరం స్మిత సన్నిహితంగా మెలిగిన మనోజ్.. స్మిత కొడుకు‌పై చదువు విషయంలో దురుసుగా ప్రవర్తించాడు. స్మిత కొడుకు ఫిర్యాదు మేరకు మనోజ్ వ్యవహారం పై దర్యాప్తు చేస్తున్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు.

Exit mobile version