Site icon NTV Telugu

Kamal Haasan: భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి పాల్గొననున్న కమల్‌హాసన్!

Kamal Hassan

Kamal Hassan

Kamal Haasan: నటుడు కమల్ హాసన్ డిసెంబర్ 24న జరగనున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి పాల్గొననున్నారు. నటుడిగా మారిన రాజకీయ నాయకుడు వచ్చే వారం ఢిల్లీలో రాహుల్‌గాంధీతో చేరనున్నారు. కమల్‌ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం ప్రకారం సూపర్ స్టార్‌ను యాత్రలో పాల్గొనమని రాహుల్ గాంధీ ఆహ్వానించారు. భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలోకి ప్రవేశించనుంది. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్, హర్యానాకు వెళ్లి వచ్చే నెలలో జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు పంజాబ్‌లోకి ప్రవేశిస్తుంది.

CJI Justice DY Chandrachud: పరువు హత్యలపై సీజేఐ సంచలన ప్రకటన!

కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎనిమిది రాష్ట్రాల్లో సాగింది. ఈ యాత్ర శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. 100 రోజులు పురస్కరించుకున్న నేపథ్యంలో దీనిని పార్టీ విజయంగా అభివర్ణించింది. బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో రాహుల్‌ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రఘురాం రాజన్, రాహుల్ గాంధీ కలిసి పాదయాత్ర గురించి చర్చిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన పాదయాత్రలో నటి స్వర భాస్కర్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన యాత్రలో ఒలింపిక్ పతక విజేత బాక్సర్, కాంగ్రెస్ నాయకుడు విజేందర్ సింగ్ కూడా పాల్గొన్నారు.

Exit mobile version