Site icon NTV Telugu

Action King Arjun : ప్రముఖుల సమక్షంలో వైభవంగా ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల రిసెప్షన్ వేడుకలు..

Action King Arjun

Action King Arjun

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన సంగతి విషయం అందరికీ తెలిసిన సంగతే. ఇకపోతే జూన్ 14న రాత్రి చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో ఐశ్వర్య అర్జున్ దంపతుల రిసెప్షన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్ శంకర్, ప్రభుదేవా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, సత్యరాజ్, కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, స్నేహ రోజా, తదితరులు అతిధిలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా కార్యక్రమం లో పాల్గొన్న తారల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version