Site icon NTV Telugu

Vikarabad: రూ.50 కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి రూ.1000 జరిమానా

Vikarabad

Vikarabad

వికారాబాద్ జిల్లాలో కేవలం 50 రూపాయల కోసం హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా న్యాయస్థానం వెల్లడించింది. గత ఏడాది పెద్దేముల్ మండలం పాషాపూర్ తండాలో రూ.50 ఇవ్వలేదని మంగ్లీ భాయ్‌ని రాథోడ్ విల్లాస్ అనే వ్యక్తి హత్య చేశాడు.

Read Also: England vs Australia: ఒక్క క్షణంలో చేజారిన క్యాచ్.. అందరు షాక్..!

వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 63/2022 అండర్ సెక్షన్- 102 ఐపీసీలో నిందితుడు అయిన రాథోడ్ విల్లాస్ పెద్దేముల్ మండలంలోని పాషాపూర్ తండాకు చెందిన వ్యక్తిగా చెప్పుకొచ్చారు. ఇవాళ ( సోమవారం ) వికారాబాద్ జిల్లా కోర్ట్ న్యాయమూర్తి రాథోడ్ విల్లాస్ కు జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధించడం జరిగింది అని జిల్లా ఎస్పీ కోటి రెడ్డి తెలిపారు.

Read Also: Manchu Manoj: అందుకే చంద్రబాబుతో భేటీ అయ్యా.. పొలిటికల్ ఎంట్రీ.. ?

గత ఏడాది (2022 సంవత్సరం) పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాషాపూర్ తండాకు చెందిన రాథోడ్ విల్లాస్ మంగ్లీ భాయిని 50 రూపాయలు ఇవ్వమని అడిగాడు.. ఆమె డబ్బులు ఇవ్వక పోవడంతో కోపంతో మంగ్లీ భాయిని హత్య చేశాడు. దీంతో విషయం తెలిసిన పెద్దేముల్ ఎస్హెచ్ఓ ఎండీ రవూప్ కేసు నమోదు చేశారు. ఈ కేసును హ్యాండిల్ చేసిన తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్.. విచారణలో కేవలం రూ. 50 కోసం మంగ్లీ భాయ్ ను హత్య చేసినట్లు పేర్కొన్నాడు అని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. అయితే, ఈ కేసులో వాదోపవాదాలు విన్న తర్వాత వికారాబాద్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జీ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్పీ కోటిరెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version