NTV Telugu Site icon

Paris Olympics 2024: మరో భారత రెజ్లర్ పై వేటు..పారిస్ వదిలి వెళ్లాలని ఆదేశం!

Antim Panghal

Antim Panghal

ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లింగ్‌కు కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. వినేష్ ఫోగట్ అనర్హత తర్వాత.. ఒలింపిక్ విలేజ్‌కు భారత రెజ్లర్ యాంటిమ్ పంఘల్ అక్రిడిటేషన్ రద్దు చేయబడింది. పారిస్ వదిలి వెళ్ళమని నిర్వహకులు ఆదేశించారు. దీనికి గల కారణాన్ని వారు వెల్లడించారు. ఆమె సోదరి, క్యాంపస్‌లోకి ప్రవేశించడానికి తప్పుడు అక్రిడిటేషన్ కార్డును ఉపయోగించిందని సిబ్బంది తెలిపారు. భద్రతా అధికారులు ఆమెను పట్టుకున్నారు. సోదరి నిషా పంఘల్‌ను ఆమె చేసిన నేరానికి పారిస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే భారత ఒలింపిక్ సంఘం (IOA) జోక్యంతో తర్వాత హెచ్చరికతో విడుదల చేశారు. ఈ సంఘటన తర్వాత ఐఓఏ.. క్రీడాకారిణి, ఆమె కోచ్, సోదరుడు, సోదరితో పాటు పారిస్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. చివరికి పంఘల్ తన వ్యక్తిగత కోచ్, స్పారింగ్ భాగస్వామిని కలవడానికి వెళ్ళింది. ఆమె తన సోదరి నిషాను పారిస్ గేమ్స్ విలేజ్ నుంచి తన లగేజీని తీసుకెళ్లడానికి అక్రిడిటేషన్‌ను ఉపయోగించమని కోరింది.

READ MORE: Power Star: OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్.. ముహూర్తం ఎప్పుడంటే..?

మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీల తొలి రౌండ్‌లో పంఘల్ తొలి మ్యాచ్ లో 0-10తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫైనల్ మ్యాచ్ టర్కియేకు చెందిన యెనెప్ యెట్‌గిల్‌తో జరిగింది. ఇప్పుడు ఆమె సోదరికి పారిస్ పోలీసులు సమన్లు జారీ చేశారు. రిపీచేజ్ ద్వారా కాంస్య పతక రేసులో నిలవాలన్న 19 ఏళ్ల క్రీడాకారిణి ఆశలు కూడా గల్లంతయ్యాయి.