Account Minimum Balance: పొదుపు ఖాతాలో బ్యాంకులు తమ ఖాతాదారులకు అనేక సౌకర్యాలను అందిస్తాయి. అయితే ఈ సౌకర్యాలతో పాటు, వినియోగదారులు కొన్ని నియమాలను కూడా పాటించాలి. వాటిలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం. ప్రతి బ్యాంకుకు వేర్వేరు కనీస బ్యాలెన్స్ పరిమితి ఉంటుంది.
ఖాతాదారుడు ఖాతా ప్రకారం మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకుంటే, ఆ కస్టమర్ నుండి బ్యాంక్ పెనాల్టీని వసూలు చేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాల్లో ప్రాంతాన్ని బట్టి కనీస నగదు నిల్వ నియమాన్ని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాలకు ఈ పరిమితి రూ. 1,000. సెమీ అర్బన్ ఏరియా వినియోగదారులు తమ ఖాతాలో రూ.2,000 ఉంచుకోవాలి. కాగా, మెట్రో సిటీలో ఈ పరిమితి 3 వేల రూపాయలు.
Read Also: Google : గూగుల్ లో సౌకర్యాలకు కోత..!
HDFC బ్యాంక్ ఖాతాదారులకు..
HDFC బ్యాంక్‌లో సగటు కనీస బ్యాలెన్స్ పరిమితి కూడా రెసిడెన్సీపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిమితి నగరాల్లో రూ.10,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500.
ICICI బ్యాంక్ ఖాతాదారులకు..
ఐసిఐసిఐ బ్యాంక్ తన ఖాతాలలో ప్రాంతాన్ని బట్టి కనీస నిల్వ నియమాన్ని నిర్ణయించింది. పట్టణ ప్రాంతాలకు రూ.10,000, సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.5,000, గ్రామీణ ప్రాంతాలకు రూ.2,500 పరిమితి ఉంది.
Read Also:Yuzvendra Chahal: చాహల్ తిప్పేశాడు.. సరికొత్త చరిత్ర సృష్టించాడు
మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ
ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న కాలంలో అంతా సవ్యంగా సాగితే బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి, మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీని రద్దు చేయాలని బ్యాంకుల డైరెక్టర్ల బోర్డు నిర్ణయించవచ్చని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావ్ కరాద్ ఇటీవల చెప్పారు.
Account Minimum Balance, HDFC, ICICI,SBI, account holders