NTV Telugu Site icon

Liquor In Train: రైలులో మద్యం తీసుకుపోవచ్చా? తీసుకెళ్తే ఎంత వరకు అనుమతిస్తారంటే..

Liquor In Train

Liquor In Train

Liquor In Train: భారతదేశంలో కోట్లాది మంది మద్యం సేవిస్తున్నారు. సమాచారం మేరకు, సగటు భారతీయ పౌరుడు సంవత్సరానికి దాదాపు 4.9 లీటర్ల మద్యం తాగుతాడు. మద్యానికి సంబంధించి భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. చట్టం ప్రకారం, భారతీయ పౌరులు ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అంతే కాకుండా ఏ ఉద్యోగి కూడా మద్యం సేవించి కార్యాలయానికి వెళ్లకూడదు. ఈ నేపథ్యంలో, మద్యంతో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉన్న ప్రశ్న. ప్రయాణ సమయంలో మద్యం తీసుకెళ్లడానికి నియమాలు ఏమిటి? ఒక వ్యక్తి ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. అతనికి ఎంత శిక్ష పడుతుంది? అసలు తీసుకెళ్లవచ్చా? ఈ ప్రశ్నలు ఉంటే.. వాటికి సమాధానాలను ఇక్కడ చూద్దాం.

Read Also: MG Hector Plus: రెండు కొత్త వేరియంట్‌లు ప్రారంభించిన MG.. వివరాలు ఇలా

రైలు ఒక ప్రజా రవాణా. ఇందులో వందలాది మంది కలిసి ప్రయాణిస్తుంటారు. అందుకోసం భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక నిబంధనలను రూపొందించింది. తద్వారా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగదు. మద్యానికి సంబంధించిన నిబంధనల గురించి మాట్లాడినట్లయితే.. రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికులు రైలులో మద్యం తీసుకవెళ్ళవచ్చు. కానీ, రైలులో మద్యం సేవించరాదు. భారతీయ రైల్వే చట్టం 1989 ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఏ ప్రయాణీకుడైనా మద్యం తీసుకెళ్లవచ్చు. అయితే ప్రయాణీకుడు మద్యం అనుమతించబడిన రాష్ట్రాలలో మాత్రమే తీసుకెళ్లవచ్చు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మద్యాన్ని నిషేధించారు. ఈ రాష్ట్రాల్లో గుజరాత్, నాగాలాండ్, బీహార్, లక్షద్వీప్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. దాంతో ప్రయాణికులు అక్కడ మద్యం తీసుకపోలేరు. ఇది మాత్రమే కాదు. ఈ రాష్ట్రాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ప్రయాణీకులు మద్యం తీసుకెళ్తుంటే, వారికి జరిమానా విధించవచ్చు. వారు జైలుకు కూడా వెళ్లవచ్చు.

Read Also: Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుడు తన వెంట రెండు లీటర్ల మద్యాన్ని మాత్రమే తీసుకెళ్లవచ్చు. అంతేకాదు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్తున్న 2 లీటర్ల మద్యం బాటిళ్లకు కచ్చితంగా సీల్ వేయాలి. నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణికులెవరూ ఓపెన్ బాటిళ్లను తీసుకెళ్లకూడదు. ఒక వ్యక్తి రైలులో మద్యం సేవిస్తూ పట్టుబడితే, రైల్వే చట్టం ప్రకారం ఆ వ్యక్తికి జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు. అంతే కాకుండా ప్లాట్‌ఫారమ్‌పై మద్యం సేవించి, బహిరంగంగా మద్యం బాటిల్‌ను తీసుకెళ్తుంటే పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Show comments