NTV Telugu Site icon

Elon Musk : ఉద్యోగినులతో మస్క్‌ లైంగిక సంబంధం..

Maxresdefault (2)

Maxresdefault (2)

Elon Musk: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పై మరోసారి సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌ (SpaceX)లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్‌ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్‌ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా కథనంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. తన పిల్లలకు తల్లి కావాలని ఓ ఉద్యోగినిని ఆయన కోరినట్లు వెల్లడించింది. శృంగారంలో పాల్గొంటే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని 2016లో మస్క్‌ చెప్పినట్లు మరో మహిళ వివరించినట్లు తాజా కథనం పేర్కొంది.