Post Office: తపాలా శాఖ ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం నూతన పథకాలు రూపొందిస్తుంది. అలాగే తాజాగా తపాలా శాఖ వినూత్న రీతిలో టాటా ఏఐజి ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీని రూ.399 కే అందుబాటులోకి తెచ్చిందని,ఈ పాలసీ ద్వారా ఎలాంటి ప్రమాదం సంభవించినా బీమా తీసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు రూ.10 లక్షల బీమా కవరేజీ వర్తిస్తుంది. యాక్సిడెంటల్ భీమా పాలసీ 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పాలసీని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తపాల శాఖ ప్రవేశపెట్టింది.
బీమా పాలసీ తీసుకోవాలాంటే..
ఈ పాలసీ పొందాలంటే ముందుగా పోస్టల్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. ఖాతా లేనివారు రూ.200 తో నూతనంగా ఖాతాను తెరవాలి. బీమా పాలసీకి రూ.399 నగదు చెల్లించాలి. ప్రమాదం సంభవిస్తే మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. దీర్ఘకాలిక పక్షవాతం ఉన్న వారికి ఈ బీమా వర్తించదు. బీమా చేసుకున్న తర్వాత ప్రమాదం సంభవించినా, పక్షవాతం వచ్చినా ఈ బీమా వర్తిస్తుంది. పాలసీ కోసం నగదు చెల్లించిన రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి బీమా రక్షణ లభిస్తుంది. పాలసీదారులకు ఒక బాండ్ ను కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
Read Also:Washing Rice? : అన్నం వండటానికి ముందు బియ్యం ఎందుకు కడుగుతారు?
పాలసీ వర్తించే విధానం ఇలా..
– యాక్సిడెంటల్ డెత్ అయితే రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది.
– శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.10 లక్షలు
– పాక్షిక వైకల్యానికి రూ.10 లక్షలు
–ప్రమాదవశాత్తు అంగచ్ఛేదం జరిగితే రూ.10 లక్షలు
– పక్షవాతం సంభవిస్తే రూ.10 లక్షలు
– వైద్య ఖర్చులకు ఐపిడి రూ.60 వేల వరకు లేదా వాస్తవ క్లైమ్ ఏది తక్కువైతే అది నిర్ణయిస్తారు.
– చిన్న గాయాలకు (ఓపిడి) రూ.30 వేల వరకు లేదా వాస్తవ క్లెయిమ్ ఏది తక్కువ అయితే అది నిర్ణయిస్తారు.
– విద్య ప్రయోజనం (గరిష్టంగా అర్హత ఉన్న ఇద్దరు పిల్లలకు)10 శాతం రూ.లక్ష అసలు ఖర్చులు ఏది తక్కువ ఉంటే అది వర్తిస్తుంది.
– ఆస్పత్రిలో ఉంటే పది రోజుల వరకు రోజుకు రూ.1000 అందిస్తారు. (ఒకరోజు మినహాయించ బడుతుంది)
– కుటుంబ రవాణా ప్రయోజనాలు రూ.25 వేలు అసలు ఏది తక్కువ అయితే అది, అంత్యక్రియల ప్రయోజనం రూ.5 వేలు అసలు ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలందరూ బీమా పొందిన ఈ పాలసీని రూపొందించారని అన్నారు.మరిన్ని వివరాల కోసం తపాలా శాఖ కార్యాలయాల్లో సంప్రదించాలి. క్లెయిమ్ కోసం 18002667780,1800229966 నంబర్లలో సంప్రదించాలని అన్నారు.
Read Also:Lightning strikes: ఉత్తర్‌ప్రదేశ్‌లో పిడుగుపాటు.. ఏడుగురు మృతి