NTV Telugu Site icon

Srinivasa Setu Flyover: శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ నిర్మాణంలో ప్రమాదం.. ఇద్దరు మృతి

Srinivasa Setu Flyover

Srinivasa Setu Flyover

Srinivasa Setu Flyover: తిరుపతిలోని శ్రీనివాస సేతు ప్లై ఓవర్ పనుల్లో భారీ ప్రమాదం జరిగింది. రిలయన్స్ మార్ట్ వద్ద నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనుల్లో భాగంగా చివరి సిమెంటు సిగ్మెంట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో క్రేన్ వైర్లు తెగిపోవడంతో ఒక్కసారిగా సెగ్మెంట్ కింద పడిపోయింది. అక్కడే ఇద్దరు కార్మికులు పనిచేస్తుండటంతో.. వారిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిజిత్, బీహార్‌కు చెందిన బార్దోమాండల్‌గా గుర్తించారు పోలీసులు. మరోవారంలో ఫ్లై ఓవర్ పనులు పూర్తవుతాయని అనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఘటనా స్థలాన్ని పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ చివరి దశలో ఈ ఘటన జరగటం చాలా బాధాకరం అన్నారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.. కేవలం మూడు సెగ్మెంట్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.. మెకానికల్ ప్రోబ్లం కారణంగా భారీ క్రేన్ కేబుల్ తెగడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.. జరిగిన ఘటన చాలా బాధాకరం, 700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగిందని.. ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగలేదు.. భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరిగింది అనుకున్న తరుణంలో ఈ సంఘటన బాధాకరం అన్నారు.. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వం నుంచి సహకారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, మరికొద్ది రోజుల్లో ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయించాం, అనుకొని విధంగా ఈ ఘటన జరిగింది, చాలా బాధాకరం అన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.

Show comments