Asia Cup 2023: ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కే ఆ ఛాన్స్.. మిగతా మ్యాచ్‌లకు లేనట్టే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కే రిజర్వ్ డే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లీగ్ దశలో ఇండియా – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఫలితం తేలేలా రిజర్వు డేని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కొలంబోలో భారీ వర్షాలు కురుస్తుండడంతో సెప్టెంబర్ 10న జరగాల్సిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫలితం తేలడం కూడా కష్టమే.. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో నిలిచిపోతే, ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి సెప్టెంబర్ 11న జరుగనుంది.
Chandramukhi 2 : గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ డైరెక్టర్..?
Also Read
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
మరోవైపు కేవలం ఇండియా-పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి మాత్రమే రిజర్వ్ డే కేటాయించగా.. మిగిలిన మ్యాచులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. సెప్టెంబర్ 9న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగనుంది. అయితే ఇదే వేదికలో సెప్టెంబర్ 10న ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరుగుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9 మ్యాచ్‌కి అంతరాయం కలిగితే రిజర్వు డే కేటాయించడం కష్టం. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 12న ఇండియా- శ్రీలంక మ్యాచ్ కూడా జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత సెప్టెంబర్ 13న మ్యాచులేమీ లేవు. దీంతో అవసరమైతే రిజర్వు డే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే అలా చేస్తే టీమిండియా వరుసగా 4 రోజులు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.
Bhumana Karunakar Reddy: వరుణ యాగానికి సాయంత్రం అంకురార్పణ
సెప్టెంబర్ 10న పాకిస్తాన్ బ్యాటింగ్ ముగిసిన తర్వాత వర్షం పడితే.., రిజర్వు డే సెప్టెంబర్ 11న టీమిండియా బ్యాటింగ్ చేయాలి. సెప్టెంబర్ 12న టీమిండియా బ్యాటింగ్ ముగిశాక వర్షం పడితే, మళ్లీ రిజర్వు డే సెప్టెంబర్ 13న ఆడాలి.. ఇలా వరుసగా నాలుగు రోజులు ఆడాలి. అయితే వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముందు ఇలాంటి ప్రయోగాలు చేయడం కూడా కరెక్ట్ కాదని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి కూడా రిజర్వు డే ఉండనుంది. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా క్లారిటీ లేదు.
- Tags
- ACC
- asia cup
- india
- Pakistan
- reserve day
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!