Site icon NTV Telugu

ACB Rides: వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు..

Vemulawada

Vemulawada

ACB Rides In Vemula Wada Temple: వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రధానంగా సరుకుల నిలువలలో వ్యత్యాసం రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక పరిచారికను కూడా బాధ్యతలు నుంచి తొలగించారు.

Drugs In Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్..

ముగ్గురు పర్యవేక్షకులతోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు ఒక పరిచారికతో కలిపి 20 జారీచేసిన మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు ఈవో వినోద్ రెడ్డి. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Amy Jackson Wedding: ఘనంగా హీరోయిన్ అమీ జాక్సన్‌ పెళ్లి.. వెడ్డింగ్‌ పిక్స్‌ వైరల్!

Exit mobile version