NTV Telugu Site icon

ACB Rides: ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ బాస్..

Acb Rides

Acb Rides

కొందరు పెద్ద స్థాయి అధికారులలో ఉన్న కొందరు అధికారులు వారికి జీతాలు వస్తున్న మరోవైపు లంచాలు తీసుకుంటూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఏవైనా పనులు జరగాలంటే అందుకు సంబంధించిన అధికారులకు ముడుపులు ముడితే కానీ మన పని ముందుకు సాగదు. ఇకపోతే ఇలాంటి సందర్భాలలో కొందరు లంచం ఇవ్వడానికి ఇష్టం లేకపోవడంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఆ అధికారులకు తగిన బుద్ధి చెబుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే..

Baby Copy Controversy: నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై తాజాగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు.

Student Teacher Romantic Video: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ స్టెప్పులు..

ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన నెలలో దొరికిన కోడిపందాల నిందితుడు లక్ష్మణ్ రాజు వద్ద నుండి సీఐ 50 వేల లంచం డిమాండ్ చేశారని తెలిపారు. దాంతో బాధితుడు గతి లేని పరిస్థితులలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఓ పథకం ప్రకారం.. శనివారం నాడు పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటుండగా టౌన్ సిఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.