Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ లు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుని సస్పెండ్ అవుతోన్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. పోలీసు అనే పేరు వింటేనే.. ఎంతో స్ట్రాంగ్ గా ఉంటుంది.. అక్రమాలు.. ఎక్కడ జరిగిన గుర్తొచ్చేది పోలీసు.. ఇక ఐపీఎస్ పాస్‌అయి డ్యూటీలో ఉంటే వేరే లెవెల్.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరే లా ఉంది.. మొన్న జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారు.. కాంతి రానా టాటా.. విశాల్ గున్ని.. పీఎస్సార్ ఆంజనేయులు.. తాజాగా మరో అధికారి సంజయ్ సస్పెండ్ అయ్యారు.. ఇలా వరసగా ఐపీఎస్‌లు సస్పెండ్ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది..
Read Also: Nizamabad Crime: నిజామాబాద్‌లో ఘరానా మోసం.. 18 పౌండ్ల కోసం రూ.2.75 లక్షల ఫ్రాడ్..
సాధారణంగా ఐపీఎస్‌లు అంటే ఎంతో బాధ్యతతో ఉంటారు.. ఉండాలి కూడా.. ప్రభుత్వం అధికారులపై సహజంగా కొంత ఒత్తిడి తెస్తుంది. వీటిని తట్టుకోలేక.. నిలబడక.. తప్పులు చేస్తే ఇరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.. ప్రస్తుతం సస్పెండ్ అయిన అధికారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ముంబై నటి కాడంబరి జత్వానీ వ్యవహారంలో ఇరుక్కుని ముగ్గురు అధికారులు సస్పెండ్ అవ్వడం నిజంగా సంచలనమే.. రాష్ట్రంలో అత్యుత్తమ విధులు నిర్వహించే అధికారులు ఇలాంటి విషయాల్లో విధులకు దూరం.. అయితే చులకన భావం ఏర్పడుతుంది. ప్రజలకు సేవ చేయడంలో అక్రమాలు అరికట్టి సరైన న్యాయం చేయడంలో ముందుండాలి.. అలాంటిది ఐపీఎస్ అధికారులే కేసులో ఇరుక్కుంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. తాజాగా, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ ఎన్. సంజయ్‌పై కూడా ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. అగ్నిమాపక శాఖ డీజీగా, సీఐడీ అదనపు డీజీగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్వహించిన విచారణలో, అగ్నిమాపక శాఖలో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు, ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సుల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం సంజయ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, విజయవాడను వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది.. ఏసీబీ కేసు నమోదు చేసింది.
Read Also: Pakistan : రాత్రికి రాత్రే ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్.. 15 మంది మృతి
ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసు పెట్టింది.. అవకతవకలకు పాల్పడి ఇష్టారాజ్యంగా కొన్ని సంస్థలకు మేలు చేశారని కేసు నమోదు అయ్యింది.. అర్హతలు లేకుండా నియామకాలు చేయడం అడ్డగోలుగా ప్రకటనలు ఇవ్వడంపై ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. దీంతో, ఏసీబీ విజయకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఇలా ఒక్కొక్కరు ఈ విధంగా సస్పెండ్ అవ్వడం మాత్రం సంచలనం అవుతోంది.. రోల్ మోడల్‌గా ఉండాల్సిన అధికారులు ఇలా రోడ్ మీద పడడం అనేది ఆలోచించాల్సిన పరిస్థితి.. ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఉన్న నియమ నిబంధనలు ఐపీఎస్‌లో చదివిన పాఠాలు గుర్తు పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. ఇదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది.. ఇంకా కొంతమంది అధికారులపై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే అంశంపై పదేపదే హెచ్చరికలు ఇస్తున్నారు.. ఇంకా కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదంటూన్నారు పవన్ కల్యాణ్… తీరు మార్చుకోకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ సస్పెన్షన్‌లే చెబుతున్నాయి.