Site icon NTV Telugu

ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెబ్బేరు కమిషనర్..

Acb Pebberu

Acb Pebberu

వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ఏసీబీ వలలో పడ్డాడు. బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. అనంతరం.. మంగళవారం పక్కా సమాచారంతో.. వనస్థలిపురం కమ్మగూడలోని ఆదిశేషు ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని కమిషనర్ ఆదిశేషు ఇంట్లో సోదాలు జరిపారు.

Exit mobile version