NTV Telugu Site icon

Formula E Car Race Case : కోర్టు తీర్పుతో ఏసీబీ దూకుడు.. పలు చోట్ల తనిఖీలు

Ktr Ed Acb

Ktr Ed Acb

హైకోర్టు తీర్పుతో దూకుడు ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసులో పలు చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది.. హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. హైదరాబాద్‌లోని గ్రీన్‌ కో కార్యాలయాల్లో, ఏస్‌ నెక్ట్స్‌కు సంబంధించిన కంపెనీ, హైటెక్‌ సిటీలోని ఏస్‌ అర్బన్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.. ఏస్‌ నెక్ట్స్ ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ కేసులో మొదటి దఫా పార్ట్‌నర్‌గా ఉంది. ఫార్ములా ఈ రేసులో భాగస్వామిగా గ్రీన్‌కోను అనుమానిస్తుంది.. బీఆర్ఎస్‌కు గ్రీన్‌కో నుంచి భారీగా ఎలక్టోరల్‌ బాండ్లు అందినట్లు.. క్విడ్‌ప్రోకో జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.. రూ.41 కోట్లు బీఆర్ఎస్‌కు బాండ్ల రూపంలో చెల్లించి ప్రతిసారీ కోటి రూపాయల బాండ్‌ను బీఆర్ఎస్‌కు చెల్లించినట్లు ఏసీబీ తెలిపింది.

READ MORE: Formula E Car Race Case : బీఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.. లీగల్ టీమ్‌తో కేటీఆర్ చర్చలు

మరోవైపు ఈడీ..
ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-రేసు కేసును అటు ఏసీబీ, ఇటు ఈడీ విచారిస్తున్నాయి. విచారణకు హాజరు కావాలని ఈడీ మాజీ మంత్రికి తెలిపింది. జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. మంగళవారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించారు. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

Show comments