Site icon NTV Telugu

Chandrababu Naidu: చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లు.. తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు!

Chandrababu Naidu

Chandrababu Naidu

ACB Court on Chandrababu Naidu PT Warrants: టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. మాజీ సీఎం చంద్రబాబు జైల్లో ఉండగానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. ప్రస్తుతం బాబు బెయిల్‌పై బయట ఉన్నందున వారెంట్లకు విచారణ అర్హత లేదని పేర్కొంది.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో నారా చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబరు 9న ఉదయం నంద్యాలలో సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆపై చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కూడా నమోదైంది. 53 రోజుల తర్వాత బాబు బెయిల్‌పై బయటకు వచ్చారు.

Exit mobile version