NTV Telugu Site icon

Corruption: ఏసీబీ వలలకు చిక్కిన అవినీతి చేపలు..

Corruption

Corruption

Corruption: రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వ్యవసాయ శాఖ, విద్యుత్‌ శాఖకు చెందిన ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు పట్టు్కున్నారు.

పట్టుబడిన వ్యవసాయ శాఖ అధికారి..
మెదక్ జిల్లా నర్సాపూర్‌ మండలానికి చెందిన వ్యవసాయ శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆగ్రో ఏజెన్సీ షాపు అనుమతి కోసం రూ.30 వేలు వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read Also: Lightning Strike: పిడుగుల బీభత్సం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

ఏసీబీకి చిక్కిన లైన్‌మెన్‌
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన రైతు వద్ద లంచం తీసుకుంటూ ఓ లైన్‌మెన్‌ ఏసీబీకి చిక్కాడు. మల్లారెడ్డిపల్లికి చెందిన సూర్యనారాయణ అనే రైతు వద్ద నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు లైన్ మెన్ వేణు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగడం కొరకు రైతును లైన్‌మెన్‌ వేణు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రైతు సూర్యనారాయణ ఏసీబీని ఆశ్రయించగా.. లంచం తీసుకుంటుండగా లైన్‌మెన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టిబడిన ఏఈ..
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు అశ్వారావుపేట ఎలక్ట్రికల్ ఏఈ శరత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.