Corruption: ఏసీబీ వలలకు చిక్కిన అవినీతి చేపలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corruption: రాష్ట్రంలో అవినీతి అధికారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే.. వారి రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు. ఏ శాఖలో చూసినా అవినీతి మరకలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో ముగ్గురు అవినీతి అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులను ఏసీబీ అధికారులు పట్టు్కున్నారు.
పట్టుబడిన వ్యవసాయ శాఖ అధికారి..
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన వ్యవసాయ శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆగ్రో ఏజెన్సీ షాపు అనుమతి కోసం రూ.30 వేలు వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కుమార్ డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
Read Also: Lightning Strike: పిడుగుల బీభత్సం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ఏసీబీకి చిక్కిన లైన్‌మెన్
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన రైతు వద్ద లంచం తీసుకుంటూ ఓ లైన్‌మెన్ ఏసీబీకి చిక్కాడు. మల్లారెడ్డిపల్లికి చెందిన సూర్యనారాయణ అనే రైతు వద్ద నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు లైన్ మెన్ వేణు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగడం కొరకు రైతును లైన్‌మెన్ వేణు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రైతు సూర్యనారాయణ ఏసీబీని ఆశ్రయించగా.. లంచం తీసుకుంటుండగా లైన్‌మెన్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ పట్టిబడిన ఏఈ..
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు అశ్వారావుపేట ఎలక్ట్రికల్ ఏఈ శరత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!