Site icon NTV Telugu

West Bengal: ఈ సారి భారత్‎లో ‘ఇండియా’ సర్కార్.. బెంగాల్లో మమత పేరుతో పోస్టర్ల కలకలం

Abki Baar India Sarkar

Abki Baar India Sarkar

West Bengal: విపక్షాల కూటమి ‘INDIA’ ప్రకటన తర్వాత పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో దాని ప్రభావం కనిపిస్తోంది. కూటమి INDIAకు సంబంధించి రాజధాని కోల్‌కతాలో కొత్త పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీ వైపు చూపిస్తూ వివిధ చోట్ల వేసిన ఈ పోస్టర్లలో మమతా బెనర్జీ చిత్రంతో పాటు – ‘అబ్ బార్ ఢిల్లీ మే ఇండియా సర్కార్’ అని రాసి ఉంది. విశేషమేమిటంటే బెంగాల్‌లో వేసిన ఈ పోస్టర్లను హిందీలో రాశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే విజయ పథాన్ని ఆపేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఒక్కటయ్యాయి. జూలై 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ పార్టీల సమావేశం జరిగింది. అక్కడ వీరంతా ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్-ఇండియా పేరుతో ఎన్‌డిఎ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Read Also:Software Engineer Family Suicide: భార్యాపిల్లలను చంపి.. టెకీ ఆత్మహత్య

ఈ నెలాఖరులో ఇండియా అలయన్స్ మూడో సమావేశం జరగనున్న తరుణంలో కోల్‌కతాలో ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ ఇండియా అలయన్స్ సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో జరగనుంది. ఈ సమావేశం కూడా బెంగళూరు మాదిరిగానే ఉంటుందని మీడియా వర్గాలు తెలిపాయి. ఇందులో మొదటి రోజు ఆగస్టు 31న విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన సమావేశం సెప్టెంబర్ 1వ తేదీన జరుగుతుంది. అదే రోజు సమావేశం అనంతరం విపక్ష కూటమి నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు మేరకు జూన్ 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల తొలి సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని మోడీని అధికారం నుంచి దింపేందుకు ఏకంగా ఎన్నికల్లో పోటీ చేయాలనే వ్యూహంపై ఈ సమావేశంలో ఒప్పందం కుదిరింది. శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), ఉద్ధవ్ థాకరే శివసేన (UBT) కలిసి ప్రతిపక్ష కూటమి మూడవ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ రెండు పార్టీలు మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో మహారాష్ట్ర వికాస్ అఘాడి కూటమిలో భాగమయ్యాయి.

Read Also:Game Changer : సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’..

Exit mobile version