NTV Telugu Site icon

Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్‌

Srisailam

Srisailam

Srisailam: శ్రీశైలం ఆలయంలో అభిషేకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలు నిలిపివేయనున్నట్లు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు వెల్లడించారు. రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి వారాంతపు సెలవులు కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 23, 24, 25 తేదీల్లో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు.. అభిషేకాలకు ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనానికి రేపటి నుంచి మూడురోజుపాటు నాలుగు విడతలుగా అనుమతించనున్నట్లు చెప్పారు. టికెట్లను దేవస్థానం వైబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

Read Also: Tirumala: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి.. టోకెన్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే..

ఇదిలా ఉండగా.. శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 23న ముక్కోటి ఏకాదశికి ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశామని శ్రీశైల ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఏకాదశి రోజు తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం, రావణ వాహన సేవ నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఆలయంలో పూజలు చేసిన తర్వాత స్వామి వారి ఆలయ ముఖ మండప ఉత్తర ద్వారం గుండా తీసుకొచ్చి గ్రామోత్సవం ప్రారంభమైన తర్వాత ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిస్తారని చెప్పారు.