Abhishek Sharma: అభిషేక్ శర్మ.. ఏమైంది బాస్? పసికూనపై కూడా పత్తా లేవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma: T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, అభిషేక్ శర్మ గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ బ్యాట్ నుంచి కొత్త మెరుపులు, సరికొత్త రికార్డులు నమోదు అవుతాయని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ప్రతీ మ్యాచ్‌లో విఫలం అవుతూ వస్తున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఈ ప్రపంచ కప్‌లో తన పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ మూడు బంతుల్లో డకౌట్ అయ్యి ఖాతా తెరవలేకపోయాడు. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ ఇప్పటి వరకు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు, నిజానికి ఇది అతని వరుస మూడో డకౌట్. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అభిషేక్ ఖాతా ఓపెన్ చేయలేదు.
READ ALSO: Maruti E Vitara కార్ల ధరల ప్రకటన.. ఏ వేరియంట్‌కు ధర.. ఎంతంటే..?
Also Read
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
వరుసగా మూడోసారి డకౌట్..
ముంబైలోని వాంఖడే స్టేడియంలో అభిషేక్ శర్మ వరుస అవుట్లు ప్రారంభమయ్యాయి. USA తో జరిగిన మ్యాచ్‌లో శర్మ తొలి బంతికే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అతను అనారోగ్యానికి గురై నమీబియాతో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే, కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరిగి మైదానంలోకి దిగిన అభిషేక్, కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరువకుండానే ఔట్ అయ్యాడు. ఇప్పుడు, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా మళ్లీ ఖాతా తెరవలేకపోయాడు, కేవలం మూడు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా మైదానం విడిచి వెళ్లాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ జెర్సీ ధరించి బ్యాటింగ్‌కు వచ్చాడు. అలా ఎందుకు చేశాడో తెలియదు.. అభిషేక్ శర్మ ఏదైనా ట్రిక్ ప్లే చేశాడా లేదంటే కేవలం అనుకోకుండా అలా సిరాజ్ జెర్సీ ధరించి వచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ ఖాతా తెరవలేకపోయాడు. నిజంగా ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ ప్రదర్శన ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.
READ ALSO: Satyadev New Movie: అనిల్ రావిపూడి చేతుల మీదుగా సత్యదేవ్ కొత్త సినిమా ప్రారంభం..
తాజావార్తలు
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!