Site icon NTV Telugu

Abhishek Sharma: తగ్గేదేలే.. అలా చేస్తే అసలు నచ్చదు.. అందుకే ఇచ్చి పడేశా!

Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్థాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి విజయాన్ని అందించాడు. ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు బ్యాట్‌తోనే దీటుగా బదులిచ్చి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచి పాకిస్థాన్ బౌలర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అభిషేక్ శర్మను లక్ష్యంగా చేసుకుని షాహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్ మాటలతో కవ్వించారు. తొలి బంతికే సిక్స్ కొట్టిన అభిషేక్, అఫ్రిది ఏదో అనడంతో ‘ఛల్’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత హారిస్ రవూఫ్ ఇంకా దూకుడుగా వ్యవహరించగా, అభిషేక్ అదే స్థాయిలో విరుచుకపడ్డాడు. ఈ వాగ్వాదంతో మ్యాచ్ మరింత హీటెక్కింది. పరిస్థితిని గమనించిన ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ ఆపడంతో వివాదం సద్దుమణిగింది.

Sahibzada Farhan: గెలవడం చేతకాదు కానీ.. ఇలాంటి వాటికి ఏం తక్కువలేదు..!

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నప్పుడు మాట్లాడుతూ.. పాక్ ఆటగాళ్లు ఎటువంటి కారణం లేకుండా మమ్మల్ని కవ్వించడం నాకు నచ్చలేదు. అందుకే బ్యాట్‌తోనే వారికి సమాధానం చెప్పాలనుకున్నాను. జట్టు గెలవాలనే ఉద్దేశ్యంతో నేను వారిపై విరుచుకుపడ్డానని తెలిపాడు.

అలాగే తనకు శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అభిషేక్ పేర్కొన్నాడు. స్కూల్ స్థాయి నుంచి తామిద్దరం కలిసి ఆడుతున్నామని, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మంచి భాగస్వామ్యం నెలకొల్పామని తెలిపాడు. పాక్‌తో మ్యాచ్‌లో సత్తా చాటాలని ముందే అనుకున్నామని, తాము ఆశించిన విధంగానే 105 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పామని అన్నాడు.

Haris Rauf: ఛీ.. ఛీ.. మొత్తానికి పాకిస్థానీ బుద్ధి బయటపెట్టావ్ కదరా.. వీడియో వైరల్

ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఫీల్డర్ల తప్పుల కారణంగా పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అయితే, టీమిండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (47), అభిషేక్ శర్మ (74) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. చివర్లో తిలక్ వర్మ 30 పరుగులు చేయడంతో భారత్ 18.5 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Exit mobile version