NTV Telugu Site icon

Abhishek Sharma: సునామి సృష్టించిన అభిషేక్ శర్మ.. 25 బంతుల్లో మెరుపు సెంచరీ..

Abhishek Sharma

Abhishek Sharma

2024 ఐపీఎల్ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ మరో మారు తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఎస్ఆర్హెచ్ కు మరపురాని బ్యాటింగ్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అభిషేక్ అదే ఫామ్ ను ఐపీఎల్ తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా గుర్గావ్ వేదికగా జరిగిన ఓ క్లబ్ మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. 25 బంతులలోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు.

Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్..

వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ కేవలం 26 బంతులలో 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ బైకర్ ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు, 4 ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లు పై ఎటువంటి కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు అభిషేక్. 396 స్ట్రైక్ రేట్ తో ఈ పరుగులను సాధించాడు. అయితే ఈ మ్యాచ్ అధికారక మ్యాచ్ కాకపోయినా ప్రస్తుతం ఈ మ్యాచ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతి తొందరలో అభిషేక్ శర్మ జాతీయ జట్టులో స్థానాన్ని సంపాదిస్తాడంటూ కామెంట్ చేస్తున్నారు.

Groom Strange Dance: ఏంటి భయ్యా.. పెళ్లి నీదేనని మర్చిపోయావా.. ఇలా రెచ్చిపోయావు..

2024 ఐపిఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరడంలో అభిషేక్ శర్మ ఎంతో కీలకపాత్రను పోషించాడు. వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ మరో ఓపెనర్ ట్రావెల్స్ హెడ్ తో కలిసి పరుగుల సునామీని సృష్టించారు. ఒకవేళ కొద్దిసేపు మాత్రమే క్రీజ్ లో ఉన్నా కానీ ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ కలిసి ఏకంగా పవర్ ప్లే లో 125 రికార్డ్ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాకపోతే టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడం పై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ అభిమానులు చాలామంది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.