NTV Telugu Site icon

Abhishek Manu Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవ ఎన్నిక..

Singvi

Singvi

తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ విత్ డ్రా గడువు ఈరోజుతో ముగిసింది. కాగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.

Read Also: NDA: 12 మంది ఏకగ్రీవం.. రాజ్యసభలో మెజారిటీ మార్క్‌కి చేరిన ఎన్డీయే..

అయితే.. ఎమ్మెల్యేలు ఎవరూ బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ క్రమంలో.. సింఘ్వీ ఏకగ్రీవమయ్యారు. కాగా.. ఆయన ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఎన్నికల అధికారి నుంచి అందుకోనున్నారు.

Read Also: Kavitha: కాసేపట్లో తీహార్ జైలు నుంచి కవిత విడుదల..

అభిషేక్ సింఘ్వీ గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2006, 2018లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయగా.. ఓడిపోయారు. సింఘ్వీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా.. తెలంగాణలో కేకే రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సింఘ్వీ ఏకగ్రీవమయ్యారు.