Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడిపోతున్నారంటూ గత కొన్నాళ్లుగా రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన వైవాహిక బంధం గురించి ఎంతో హుందాగా మాట్లాడి, ఆ వార్తలకు పరోక్షంగా ముగింపు పలికారు. తమ మధ్య ఎలాంటి ‘ఈగో’ సమస్యలు లేవని, ఒకరినొకరు గౌరవించుకోవడమే తమ విజయ రహస్యమని ఆయన స్పష్టం చేశారు.
తన భార్య ఐశ్వర్యరాయ్ కెరీర్ గురించి అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ‘నా భార్య తన పనిని వదులుకుంటేనే నేను సురక్షితంగా (Secure) ఫీల్ అవుతాను అనుకునే వ్యక్తిని కాదు. అలాంటి అభద్రతాభావం (Insecurity) మా మధ్య లేదు. నా తండ్రి అమితాబ్ బచ్చన్ కంటే నా తల్లి జయా బచ్చన్ పెద్ద స్టార్ అయిన సమయంలోనే వారు పెళ్లి చేసుకున్నారు. ఆ వారసత్వాన్ని నేను చూశాను. ఐశ్వర్య సాధించే విజయాలు నాకు గర్వకారణమే తప్ప, అవి మా మధ్య ఈగో సమస్యలను తీసుకురావు’ అని అభిషేక్ కుండబద్దలు కొట్టారు.
Also Read
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
తమ కుమార్తె ఆరాధ్య గురించి చెబుతూ.. ‘పిల్లలకు నీతులు చెప్పడం కంటే మన ప్రవర్తన ద్వారా ఆదర్శంగా నిలవడమే నిజమైన పెంపకం. తండ్రులు అంత మంచి టీచర్స్ కాలేరు కానీ, సరైన విలువలను బిడ్డకు అందించడంలో ఐశ్వర్య, నేను ఎప్పుడూ ఒకే మాటపై ఉంటాం’ అని పేర్కొన్నారు. సుమారు రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ జంట మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి చాటిచెప్పాయి. ఏప్రిల్ 20, 2007న వివాహం చేసుకున్న ఈ జంటపై వస్తున్న పుకార్లు కేవలం ఊహాగానాలేనని అభిషేక్ మాటలతో స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!