NTV Telugu Site icon

Divorce Rumours: ఐశ్వర్య, అభిషేక్ విడిపోలేదు.. ఇదిగో ప్రూఫ్!

Abhishekaishwarya Dubai

Abhishekaishwarya Dubai

Abhishek Bachchan, Aishwarya Rai Divorce Rumours: బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్స్ అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్‌తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. అంబానీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరుగా హాజరుకావడం కూడా ఆ వార్తలకు బలం చేకూర్చింది. అయితే ఆ రూమర్లన్నింటికీ ఒక్క వీడియోతో చెక్‌ పడింది.

అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్ జంట తాజాగా దుబాయ్ వెకేషన్‌కు వెళ్ళింది. ఈ జంట తమ కుమార్తె ఆరాధ్యతో కలిసి దుబాయ్ విమానాశ్రయంలో కనిపించారు. ముగ్గురు దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కుతున్నారు. అభిషేక్ క్యాజువల్ రెడ్ హూడీ, బ్లాక్ డెనిమ్ జీన్స్ ధరించగా.. ఐశ్వర్య బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు. ఇక ఆరాధ్య గులాబీ రంగు టాప్, డెనిమ్ జీన్స్ వేసుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో బయటికి రావడంతో అన్ని రూమర్లకు చెక్ పడినట్లయింది.

Also Read: Allu Arjun: మెగా vs అల్లు వివాదం.. మామయ్యకు అల్లుడు విషెస్‌!

అభిషేక్, ఐశ్వర్యల వీడియోపై ఫాన్స్ బిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది పాత వీడియో’ అని కొంతమంది కామెంట్ చేయగా.. ‘గతేడాది అవార్డ్స్ షో కోసం వెళ్లినప్పటి వీడియో’ అని ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉంది. అభిషేక్ చివరిగా ఘూమర్‌లో కనిపించారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న కింగ్‌లో అతడు కనిపించబోతున్నాడు. పొన్నియన్ సెల్వన్ IIలో ఐశ్వర్య చివరగా నటించారు.

Show comments