Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abdullah Shafique: వెస్టిండీస్‌లో దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఏ పాకిస్తాన్ బ్యాటర్‌కు సాధ్యం కాని అరుదైన రికార్డును యువ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో చెలరేగిన షఫీక్, ఏకంగా 49 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ చరిత్ర సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ 323 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కారీబియన్ గడ్డపై పాకిస్తాన్ తరఫున 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన అరుదైన బ్యాటర్‌గా నిలిచి సుదీర్ఘ కాలం నాటి రికార్డును తిరగరాశాడు.
అబ్దుల్లా షఫీక్ చేసిన ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ బలంతో పాకిస్తాన్ మ్యాచ్‌పై తన పట్టును మరింత బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్ ఇండీస్ చేసిన 344 పరుగుల స్కోరుకు సమాధానంగా పాకిస్తాన్ 387 పరుగులు సాధించి కీలకమైన ఆధిక్యాన్ని అందుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్ నుంచి షఫీక్‌కు అద్భుతమైన మద్దతు లభించింది. బాబర్ 147 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 88 పరుగులు చేసి సెంచరీకి అతి సమీపంలోకి వచ్చి దురదృష్టవశాత్తు అవుటయ్యాడు. బాబర్ నిష్క్రమించిన తర్వాత పాక్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడినప్పటికీ, లోయర్ ఆర్డర్లో సాజిద్ ఖాన్ 30 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 387 పరుగుల మంచి స్కోరును అందించాడు.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
అంతకుముందు, ఈ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్ ఇండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్టిన్ గ్రీవ్స్ (73), రోస్టన్ చేజ్ (70) ల బాధ్యతాయుతంగా ఆడుతూ అర్ధ శతకాలతో 344 పరుగుల సవాల్‌తో కూడిన స్కోరును నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్ సాజిద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, అతనికి తోడుగా మహ్మద్ అలీ, ఉవైద్ షా, అలీ ఉస్మాన్ తలా రెండు వికెట్లు తీసి విండీస్‌ను కట్టడి చేశారు. ఓవరాల్‌గా షఫీక్ బాదిన ఈ చారిత్రక నాటౌట్ ఇన్నింగ్స్ మ్యాచ్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!