Site icon NTV Telugu

AB Devilliers: అసలేందుకు రిటైర్ అయ్యావు బాసు.. ఈ వయసులో కూడా దూకుడు తగ్గలేదుగా.. వీడియో వైరల్!

Abd

Abd

AB Devilliers: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లైనా తన ఆటతీరు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు దక్షిణాఫ్రికా దిగ్గజం AB డివిలియర్స్. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో జులై 22న ఇండియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ బ్యాట్‌తోనే కాదు, ఫీల్డింగ్‌తోనూ అబ్బురపరిచారు. అతడి వయసు 41 అయినా ఫిట్‌నెస్‌, స్పీడ్‌ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. నార్తాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 208 పరుగులు చేసింది. డివిలియర్స్ కెప్టెన్‌గా ఆడి కేవలం 30 బంతుల్లో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ధనా ధన్.. ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరు చేసింది. అతనికి తోడుగా స్మట్స్ (30), రుదాల్ఫ్ (24), అమ్లా (22), డుమిని (16) కూడా సహకారం అందించారు.

WCL 2025: ఘోరంగా విఫలమైన టాప్ ఆర్డర్.. తేలిపోయిన భార‌త ఛాంపియ‌న్స్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి!

ఇకపోతే, భారీ లక్ష ఛేదనకి వచ్చిన భారత ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో యూసఫ్ పఠాన్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టాడు. బౌండరీ లైన్‌కు దగ్గరగా పరిగెత్తుకుంటూ వచ్చిన డివిలియర్స్ డైవ్ చేస్తూ బాల్ అందుకున్నాడు. కానీ, బౌండరీ లైన్ దాటి వెళ్తున్నానన్న ఆలోచించిన AB డివిలియర్స్, ఆ వెంటనే తన పక్కన ఉన్న ఫీల్డర్ సారెల్ ఎర్వీకి బాల్ విసిరేశాడు. దానితో అలెర్ట్ అయినా ఎర్వీ కూడా డైవ్ చేస్తూ బంతిని అందుకొని అదిరిపోయే రిలే క్యాచ్ ను అందుకున్నారు. ప్రస్తుతం ఈ రిలే క్యాచ్ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత స్పీడ్ కేవలం ABకే సాధ్యం అంటూ వారి అభిమానాన్ని చాటుతున్నారు.

Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా.. పవన్ ఫ్యాన్స్‌కి మరో బంపర్ ట్రీట్..

ఇక లక్ష్య ఛేదనలో భారత్ ఛాంపియన్స్ బ్యాటింగ్ దారుణంగా విఫలమైంది. టాప్ ఆర్డర్ మొత్తం కలిపి కేవలం 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రాబిన్ ఉతప్ప (2), శిఖర్ ధావన్ (1), అంబటి రాయుడు (0), సురేశ్ రైనా (16), యూసఫ్ పఠాన్ (5) అందరూ నిరాశపరిచారు. చివర్లో స్టువర్ట్ బిన్నీ ఒంటరిగా పోరాడి 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 18.2 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేయగా, ఫెడ్ లైట్స్ కారణంగా డక్‌వర్థ్ లూయిస్ పద్ధతిలో 88 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Exit mobile version