Site icon NTV Telugu

Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

Telangana Aarogyasri

Telangana Aarogyasri

Aarogyasri To Stop in Telangana Soon Due to Dues: పేద ప్రజల వైద్యానికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్పొరేట్‌ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి గతంలో ఉన్న రూ.5 లక్షల పరిమితిని రేవంత్ రెడ్డి సర్కార్ రూ.10 లక్షలకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నెలాఖరు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్య శ్రీ బకాయిలు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణం. గతంలో (2025 జనవరి 10) ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Also Read: Konda Surekha: మేడారంకు వచ్చే భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పిస్తాం!

గత ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నట్లు సమాచారం. బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సేవలు బంద్ చేయాలని ప్రైవేట్ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఆగష్టు నెలాఖరు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంకా సమయం ఉండడంతో ప్రభుత్వం చర్చలు జరపడం లేదా బకాయిలు చెల్లించడమో చేస్తుందో లేదో చూడాలి. ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయితే పేద ప్రజలకు కష్టాలు తప్పవు.

Exit mobile version