NTV Telugu Site icon

Aaradhya Bachchan: ఆరాధ్య న్యూ లుక్ అదిరిపోయిందిగా.. ఎంత క్యూట్ గా ఉందో..

Aaradhya

Aaradhya

బ్యూటిఫుల్ భామ ఐశ్వర్యరాయ్‌, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి అందరికి తెలుసు.. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. హీరోయిన్ కాకముందే అంతకు మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఐష్‌ కూడా కూతురి స్కూల్‌ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఆరాధ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఆరాధ్య న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

తాజాగా అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్‌ తారలు హాజరైన సంగతి తెలిసిందే.. అందులో బచ్చన్‌ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్‌, ఐష్‌, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్‌ను తెగ ఎంజాయ్‌ చేశారు.. ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్‌కట్‌ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్‌ లీవ్‌ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి… అవి చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

అచ్చం తల్లిలాగానే ఉందనే కామెంట్స్ ను అందుకుంది.. ఆ ఈవెంట్ లో చాలా అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్శించింది.. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో లేటెస్ట్ లుక్ చూసి షాక్ అవుతున్నారు..ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్‌స్టైల్‌ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది’ అని కామెంట్లు చేస్తున్నారు..

Show comments