Raghav Chadha: రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. నలుగురు రాజ్యసభ ఎంపీల తమ అనుమతి లేకుండా తమ పేర్లను ఆగస్టు 7న తీర్మానంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ బుధవారం ఎంపీల ఫిర్యాదులను ప్రివిలేజెస్ కమిటీకి పంపారు.
Also Read: Indian Economy: 2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే
ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్, ఎం తంబిదురై, నరహరి అమీన్ తమను అడగకుండానే తమ పేర్లను హౌస్ ప్యానెల్‌లో చేర్చారని రాఘవ్ చద్దాపై ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ రాఘవ్ చద్దాను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. రాఘవ్ చద్దాపై ఫోర్జరీ సంతకాల ఆరోపణలు తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైనవి అని ఆ పార్టీ పేర్కొంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాఘవ్ చద్దాను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆప్ ఆరోపించింది.