Site icon NTV Telugu

Punjab: పంజాబ్‌లో దుండగుల ఫైరింగ్.. ఆప్ కార్యకర్త మృతి

Aap Worker Fire

Aap Worker Fire

పంజాబ్‌లో (Punjab) కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగుల కాల్పుల్లో ఒక ఆప్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కారులో వెళ్తుండగా టార్న్ తరణ్‌ దగ్గర పట్టపగలే అగంతకులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే గురుప్రీత్ సింగ్ గోపీ అనే ఆప్ కార్యకర్త ప్రాణాలు విడిచారు.

పంజాబ్‌లోని టార్న్ తరణ్‌లో గోయింద్‌వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. కోర్టు విషయంలో ఆయన కపుర్తలా జిల్లాకు వెళ్తుండగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. కారులోనే ఆయన కుప్పకూలిపోయారు. స్థానికులు అప్రమత్తమై రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలను పోలీసుల అన్వేషిస్తున్నారు.

పంజాబ్‌లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వమే ఉంది. భగవంత్ మాన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆప్ నేతలు, కార్యకర్తలు.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

Exit mobile version