Site icon NTV Telugu

Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు

Sanjay Singh

Sanjay Singh

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కొత్త చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ‘క్యాష్ ఫర్ జాబ్స్’ ప్రకటనపై సీఎం ప్రమోద్ సావంత్ భార్య వేసిన రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సంజయ్ సింగ్‌కు గోవా కోర్టు నోటీసులు పంపింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తన పేరును పేర్కొన్నందుకు సంజయ్ సింగ్ నుండి సీఎం ప్రమోద్ సావంత్ భార్య 100 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరింది. ఈ నోటీసుకు 2025 జనవరి 10లోగా సమాధానం ఇవ్వాలని సంజయ్ సింగ్‌ను కోర్టు ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన సీఎం ప్రమోద్ సావంత్ భార్య సులక్షణ సావంత్‌పై ఆరోపణలు చేశారు. దీంతో.. సులక్షణ సావంత్ ఉత్తర గోవాలోని బిచోలిమ్‌లో ఉన్న సివిల్ కోర్టులో పరువునష్టం ఫిర్యాదును దాఖలు చేసింది.

Read Also: New Registration Charges: జనవరి​ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు..! క్లారిటీ ఇచ్చిన మంత్రి

బిచోలిమ్ సివిల్ కోర్టు మంగళవారం ఈ కేసును విచారించి సంజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కలిగించే ప్రకటనకు క్షమాపణలు చెప్పేలా సంజయ్ సింగ్‌ను ఆదేశించాలని సులక్షణ సావంత్ కోర్టును అభ్యర్థించారు. ఈ క్షమాపణలో చెప్పిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు అవాస్తవమని, వాస్తవాల ఆధారంగా కాదని స్పష్టం చేయాలని తెలిపారు. సంజయ్ సింగ్ ప్రకటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.

Read Also: Amit Shah: రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన పరువు తీసేలా బహిరంగ ప్రకటనలు చేయకుండా సంజయ్ సింగ్‌ను నిరోధించాలని ఫిర్యాదుదారు కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన కొంతమందికి లక్షల రూపాయలు బలవంతంగా చెల్లించాలని గోవాలో చాలా మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. ఉద్యోగానికి సంబంధించిన నగదు కుంభకోణంపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version