NTV Telugu Site icon

Ram Mandir Ceremony: నేను అయోధ్యకు వెళ్తున్నాను.. ఏం చేస్తారో చేసుకోండి..

Harbajan Singh

Harbajan Singh

Harbhajan Singh: జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రాన ప్రతిష్ట కార్యక్రమానికి తాను వెళ్లి తీరుతానని టీమిండియా మాజీ క్రికెటర్‌, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ వెల్లడించారు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకొకున్నా.. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి పుణ్యకార్యాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని విపక్ష పార్టీలకు ఆయన హితవు పలికాడు. వ్యక్తిగతంగా తాను దేవుడిని నమ్ముతాను.. ఈ విషయంలో ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తాను పట్టించుకోనని భజ్జీ తెలిపాడు. కాగా, జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన జరుగనుంది. అయితే, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తాము ఈవెంట్‌ను బాయ్‌కాట్‌ చేస్తామంటూ ప్రకటించాయి.

Read Also: Lavu Sri Krishna Devaraya: ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌కి నిజమైన వారసుడు చిరంజీవి.. వారిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయొద్దు..

ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ రియాక్ట్ అవుతూ.. రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు నుంచి నాకొక లేఖ వచ్చింది.. ఆ తర్వాత నేను వాళ్లకు ఫోన్‌ చేసి విషయం కనుక్కున్నాను.. ఈ కార్యక్రమానికి మర్యాదపూర్వకంగా నన్ను ఆహ్వానించేందుకు వస్తామని చెప్పినట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. కానీ, కానీ ఎవరూ రాలేదు అని ఢిల్లీ సీఎం ఆరోపించారు.

Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఆఫ్ఘనిస్థాన్ నుంచి ప్రత్యేక కానుక..

ఈ రామ మందిర ప్రారంభోత్సవానికి చాలా మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తారని ఢిల్లీ సీఎంకు రాసిన లేఖలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆహ్వానం అందుకున్న ఒక్క వ్యక్తిని ఆలయంలోపలికి అనుమతిస్తామని చెప్పారు.. దీంతో కేజ్రీవాల్.. తాను జనవరి 23వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లి వస్తాను అని చెప్పుకొచ్చారు.. 22వ తేదీని కేవలం నా ఒక్కడినే అనుమతి ఇస్తారు.. కానీ తర్వాత రోజు నా కుంటుంబం మొత్తం వెళ్లి రాంలాల్లాను దర్శించుకుంటాను అని ఆయన వెల్లడించారు.