NTV Telugu Site icon

Satyendar Jain: జైలు నుంచి బయటకు వచ్చి జైన దేవాలయం దర్శించిన జైన్‌ దంపతులు

Satyendar Jain

Satyendar Jain

Satyendar Jain: ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు శుక్రవారం (అక్టోబర్ 18) ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో అతడిని బెయిల్‌పై విడుదల చేయాలని జైలు పాలకమండలిని కోర్టు ఆదేశించింది. తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల పనిని ఆపడానికే తనను జైలుకు పంపారని అన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేందర్ జైన్ మాట్లాడుతూ.. ఇప్పుడు మన నేతలంతా బయటకు వచ్చారని అన్నారు. ఇప్పుడు మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి చూపిస్తా అని అన్నారు.

Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..

ఇకపోతే, సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో మే 2022 నుండి జైలులో ఉన్నారు. జైలు నుంచి విడుదలైన సత్యేందర్ జైన్‌కు ఆప్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ సీఎం అతిషి, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తీహార్ జైలుకు చేరుకుని కౌగిలింతలతో స్వాగతం పలికారు. అయితే రోస్ అవెన్యూ కోర్టు సత్యేంద్ర జైన్‌కు రూ. 50 వేల వ్యక్తిగత బాండ్‌పై బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు మూడు షరతులు విధించింది కోర్టు. మొదటిది, మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన ఏ సాక్షిని లేదా వ్యక్తిని సత్యేంద్ర జైన్ సంప్రదించకూడదు. రెండవది, అతను కేసును ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదు. మూడవది, AAP నాయకుడు కోర్టు ముందస్తు అనుమతి లేకుండా భారతదేశం వెలుపల ప్రయాణించకుండా కూడా నిషేధం.

Protem Speaker: జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణం..

తాజాగా మంత్రి సత్యేందర్‌ జైన్‌ (Satyendar Jain) రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తీహార్‌ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఇవాళ ఆయన తన భార్యతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని సరస్వతి విహార్‌ లోగల జైన దేవాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో జైన్ దంపతులు స్వామికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.