NTV Telugu Site icon

Satyendar Jain: జైలు బాత్‌రూమ్‌లో కుప్పకూలిన సత్యేందర్ జైన్

Aap, Satyendar Jain, Hospitali, Tihar Jail, Bathroom

Aap, Satyendar Jain, Hospitali, Tihar Jail, Bathroom

Satyendar Jain: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు. నేడు ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. బుధవారం రాత్రి తన రూంలోని బాత్రూంలో సత్యేందర్ అపస్మారక స్థితిలో పడిపోయారు. దీంతో వెంటనే విధుల్లో ఉన్న సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఆయనను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పడిపోవడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. తల తిరగడంతోనే ఇలా జరిగినట్టుగా చెబుతున్నారు.

Read Also:Minister Srinivas Goud: లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి.. ఆ తరువాత ఏమైందంటే..

‘‘సత్యేందర్ జైన్‌ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్చారు. తీహార్ జైలులోని వాష్ రూమ్‌లో తల తిరగడంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఇంతకు ముందు కూడా సత్యేందర్ జైన్ బాత్రూంలో పడిపోవడంతో వెన్నెముకకు తీవ్రమైన గాయం అయింది’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఇక, సోమవారం సత్యేందర్ జైన్‌కు అనారోగ్యంగా ఉండడంతో సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.ఇక, సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.

Read Also:Adipurush: జై శ్రీరామ్ సంచనలం మర్చిపోక ముందే “రామ్ సియా రామ్” రిలీజ్…

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యేందర్ జైన్ పలుమార్లు బెయిల్ కోసం ఇప్పటికే ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సత్యేందర్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్వీ మాజీ మంత్రి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న జైన్ 35కిలోలు బరువు తగ్గారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో సత్యేందర్ బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణకు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించేందుకు సుప్రీం ఓకే చెప్పింది.