Site icon NTV Telugu

Manish Sisodia: ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్

Sosiodu

Sosiodu

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్‌ను నిరాకరిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా తరపు న్యాయవాది ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దరఖాస్తుదారుడు శాసన సభ సభ్యుడిగా ఉన్నారని.. పైగా ఎన్నికల సీజన్ నడుస్తోందని గుర్తుచేశారు. గురువారం మధ్యాహ్నం 12:30 కల్లా పేపర్లు సరిగ్గా ఉంటే.. శుక్రవారం మా దగ్గరకు వస్తుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అన్ని పేపర్లు సరిగ్గా ఉంటే శుక్రవారం విచారిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Health Tips : ఖాళీ కడుపుతో జ్యూస్ లు తాగుతున్నారా? ఏం జరుగుతుందంటే?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. గతేడాది నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం బెయిల్ కోరారు. న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్లు కూడా న్యాయస్థానాలు తిరస్కరించాయి. మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 1న జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ఇక ఎన్నికల్లో కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Anna Rambabu: ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యం..

Exit mobile version