EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమీర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ అరంగేట్రం మరియు కెరీర్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జునైద్ ఖాన్ ఫస్ట్ సినిమా లవ్ యాపా ప్లాప్ కావడంతో ఈసారి స్వయంగా అమీర్ రంగంలోకి దిగి ఏక్ దిన్ సినిమా విషయంలో అన్ని తానై వ్యవహరించాడు. తాజాగా ‘ఏక్ దిన్’ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ వేడుకలో సినిమాలోని సన్నివేశాలు మరియు జునైద్ ఖాన్ ప్రదర్శన చూస్తున్న సమయంలో అమీర్ ఖాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనవ్వడం అందరినీ కదిలించింది. కొడుకు ఎదుగుదలను చూసి ఒక తండ్రిగా అమీర్ కంట్లోని ఆనందభాష్పాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్ తన కుమారుడితో పాటు హీరోయిన్ సాయి పల్లవిని కూడా ఆకాశానికెత్తారు. “ప్రస్తుతం మన దేశంలో ఉన్న అత్యుత్తమ నటీమణులలో సాయి పల్లవి ఒకరు” అని ఆయన కొనియాడారు. జునైద్ గురించి సరదాగా మాట్లాడుతూ.. “జునైద్ కూడా బాగానే చేశాడు” అంటూ నవ్వుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఏక్ దిన్’ సినిమా అమీర్ ఖాన్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ విడుదలై 38 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 29న ప్రత్యేక ప్రీమియర్ ప్రదర్శించబోతున్నారు. ఒక సున్నితమైన రొమాంటిక్ డ్రామాగా జపాన్ నేపథ్యంలో సాగే ఈ కథలో జునైద్ మరియు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందిని టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సునీల్ పాండే దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Megastar #AamirKhan was moved to tears after witnessing his son Junaid Khan’s performance in #EkDin 😭😭#SaiPallavi #JunaidKhan
— GAURAV (@Gaurav_HRX) April 26, 2026
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!